Saturday, 18 November 2023

ఆల్ ఇండియా మహిళా ఎంపవర్‌మెంట్ పార్టీ (AIMEP) జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేస్తాం : జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ నౌహెరా షేక్




  ఆల్ ఇండియా మహిళా ఎంపవర్‌మెంట్ పార్టీ (AIMEP)జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేస్తాం : జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ నౌహెరా షేక్

 





హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా మహిళా ఎంపవర్‌మెంట్ పార్టీ షేర్ లింగంపల్లి అభ్యర్థి విజయాన్ని ఆసంక్రీస్తు ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ నౌహీరా షేక్ మాట్లాడుతూ 1998 నుండి మహిళా హక్కులకై పోరాడుతున్న తమ పార్టీ రాజకీయంగా కట్టడి చేయటానికి చూస్తున్నారని ఆమె అన్నారు



2018లో కర్ణాటక నుండి వచ్చిన తను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 119 సీట్లకు తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన మరుసటి రోజే తనపై అనేక రకాల తప్పుడు కేసులు బనాయించి రెండున్నర సంవత్సరాలు నన్ను జైల్లో ఉంచారని ఆమె పేర్కొన్నారు కేసుల మీద కేసులు వేసి నన్ను జైలు పాలు చేసిన ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆమె 2024లో ఎలక్షన్లో దేశంలోని అన్ని పార్లమెంట్లు స్థానాలను తమ పార్టీ పోటీ చేయిస్తుందని అధికారమే లక్ష్యంగా తమ పార్టీ ఎన్నికల్లో పోరాడుతుందని 43 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి సుల్తాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తమ వాణి అసెంబ్లీలో వినిపించాలని తమ పార్టీ అన్ని విధాల మహిళ సాధికారకు సమాజంలో గుర్తింపు తీసుకురావాలని ఆమె కోరారు. దేశంలో మహిళల గురించి మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించిందని తమ పార్టీని ప్రతి మహిళ కూడా ఆదరిస్తుందని తమకు గట్టి నమ్మకం ఉందని తెలిపారు వంట గ్యాస్ సరుకులు ఉచితంగా ప్రతి కుటుంబానికి అందించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఎసులుబాటు కూడా అమలు చేస్తామని ఆమె అన్నారు.